![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -345 లో... కళ్యాణ్ నీపై ప్రేమతో ఈ ఉత్తరం రాసాడు. ఇది చదివితే నిన్ను కళ్యాణ్ ఎంత ప్రేమిస్తున్నాడో అర్థమవుతుంది. భార్యని ప్రేమించే భర్త దొరకడం చాలా అదృష్టం. ఆ విషయంలో నువ్వు చాలా లక్కీ.. భర్త ప్రేమ పొందలేని వాళ్ళకే ఆ బాధ తెలుస్తుంది. ఈ లెటర్ చదువని అనామికకి కావ్య ఇస్తుంది. ఆ పిచ్చి రాతలు రాస్తూనే ఉంటాడా.. నువ్వు నీ భర్త కంపెనీని ఏలేస్తారా అని అనామిక అనగానే.. స్వప్న వచ్చి ఏంటే ఈ పిచ్చిదానికా నువ్వు చెప్పేదని అనామికని తిడుతుంది..
ఆ తర్వాత తన భర్తని ఆఫీస్ కి పంపించి ఇంట్లో చక్రం తిప్పాలని చూస్తుంది.. పాపం దీనికేం తెలుసు.. మీ అత్త దాని అత్త గురించి అని స్వప్న అనామికకి గట్టిగా క్లాస్ పీకుతుంది. ఆ తర్వాత అందరు భోజనం చేస్తుంటారు. కళ్యాణ్ రాలేదా అని రాజ్ అడుగుతాడు. అనామిక కూడ రాలేదని ధాన్యలక్ష్మి చెప్తుంది. ఇంత జరిగిన నీ కొడుకు గురించి ఆలోచించవా.. కోడలి గురించి ఆలోచిస్తన్నావని అపర్ణ అనగానే.. నా కోడలు ఏం చేసింది.. చేసిందంతా నీ కోడలే ఆఫీస్ లో వర్క్ చేయకుండా కవితలు రాస్తుంటే, వద్దు నువ్వు చెయ్యాల్సిన వర్క్ ఇది అంటు రాజ్ గాని, నీ కోడలు గాని చెప్పారా అని ధాన్యలక్ష్మి అంటుంది. ఇక మళ్ళీ మొదలైందా అంటూ రాజ్ వెళ్లిపోతుంటే.. మీరు ఉండండి కళ్యాణ్ ని తీసుకొని వస్తానంటు కావ్య వెళ్తుంది.. ఇక కళ్యాణ్ ని ఎలా సెటిల్ చెయ్యాలో నేను చూసుకుంటానని రాజ్ అంటాడు. ఆ తర్వాత కళ్యాణ్ దగ్గరకి కావ్య వచ్చి.. మీకు నచ్చింది చెయ్యండి. పేరు తెచ్చుకోండి అని సలహా ఇస్తుంది.
ఆ తర్వాత నేను చెప్పింది.. అసలు జరగట్లేదు. ఇలాగే నేను పట్టు వదలను. అనుకున్నది సాధిస్తానని అనామిక అనుకుంటుంది. అప్పుడే నా వాళ్ళ బాధ పడి ఉంటే సారీ అని కళ్యాణ్ వచ్చి చెప్తాడు. నువ్వు ఇంత చీప్ గా ఆలోచిస్తావని అనుకులేదు. నా పక్క పంచుకోవడానికి ఇలా చేస్తావా అని అనామిక అనగానే.. దాంతో కళ్యాణ్ అనామికపై చెయ్యి లేపుతాడు. నీపై ఎంతో కొంత నమ్మకం ఉండేది. ఇప్పుడు అది కూడా పోయింది. నీ అంతటా నువ్వు వచ్చే దాకా నీ నీడని కూడా తాకనని చెప్పి కళ్యాణ్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రాజ్ కావ్యతో మాట్లాడతాడు. నువ్వు అయిన ఆఫీస్ గురించి తెలుసుకో అని కళ్యాణ్ కి చెప్పొచ్చు కదా, అప్పుడైన వాళ్ళ కాపురం బాగుంటుందని రాజ్ అనగానే.. మన కాపురానికే దిక్కు లేదు. నేనే చెప్పాలిక అని కావ్య అంటుంది. మరుసటిరోజు ఉదయం కళ్యాణ్ కి రాజ్ ఒక బ్రాంచ్ బాధ్యతలు అప్పజెప్పుతాడు. దాంతో ధాన్యలక్ష్మి, అనామిక ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ కళ్యాణ్ మాత్రం వద్దని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |